1)కాలగమనంలో ఓడలు బళ్లవుతాయి.. బళ్లు ఓడలవుతాయి అంటుంటాం. సిలికాన్ వ్యాలీకి కూడా ఇది వర్తిస్తుంది. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న సిలికాన్ వ్యాలీ ఒకప్పుడు.. పంటపొలాలతో నిండి ఉన్న ప్రాంతం. అదీరోజు.. ప్రపంచ కంప్యూటర్ పరిశ్రమకు రాజధానిగా మారిపోయింది. దీని వెనకాల విలియం షాక్లీ (1910-1989) కృషి ఉంది. షాక్లీ భౌతికశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.. ట్రాన్సిస్టర్ ను కనుక్కున్నది ఈయనే. కాలిఫోర్నియాకు సిలికాన్ టెక్నాలజీని షాక్లీ మొట్టమొదటిసారిగా పరిచయం చేశారు. ఆ ప్రాంతంలో సిలికాన్ ఆధారిత పరిశ్రమలను నెలకొల్పేలా తన విద్యార్ధులకు స్ఫూర్తినిచ్చారు. ఇలా మొదలైన పరిశ్రమలు.. 1960, 70లలో విపరీతంగా పెరిగిపోయి.. ఆ ప్రాంతం తీరుతెన్నులే మారిపోయాయి. క్రమంగా సిలికాన్ వ్యాలీ అన్న పేరు వచ్చింది.
No comments:
Post a Comment