నేను చాలా తప్పు చేశాను.. ఆ కణం అసలు ఉనికిలోనే లేదు.. అసలుండదు కూడా. నా అంచనా తప్పు!" - అస్ట్రియన్
శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత వోల్ఫ్ గ్యాంగ్ పౌలి (1900-1958) మాటలు ఇవి. ఈ విశ్వంలో.. ద్రవ్యరాశి లేని, ఆవేశం లేని ఒక కణం ఉందని పౌలి 1931లో ప్రతిపాదించారు. అయితే, ఆ కణానికి సంబంధించిన ఆధారాలు మచ్చుకు కూడా కనిపించకపోవటంతో.. తన ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నారు. ఆ సందర్భంలోనే.. నేను చెప్పింది తప్పు అని బహిరంగంగా ప్రకటించారు. అయితే, ఆయన అంచనా తప్పుకాదని సైన్స్ నిరూపించింది. పౌలి ప్రతిపాదనను మరింత అభివృద్ధి పరుస్తూ.. ఇటాలియన్ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఎన్రికోఫెర్మి (1901-1954) ఆ అజ్ఞాత కణాల గురించి మరిన్ని వివరాలు పేర్కొన్నారు. అంతేగాక.. దానికి న్యూట్రినో అన్న పేరు కూడా పెట్టారాయన. అనంతర కాలంలో వివిధ శాస్తవేత్తలు మూడురకాల న్యూట్రినోలను ఆవిష్కరించారు.
No comments:
Post a Comment